Wednesday, 4 November 2026

బీరప్పా జాతరలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్టెప్పులు

 

 

 

 

 

 

సదాశివపేట, ఏప్రిల్ 10, జనంసాక్షి : బీరప్పా స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి అన్నారు. సదాశివపేట మండలంలోని నాగులపల్లి గ్రామంలో కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన బీరప్పా స్వామి కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులకు ఎల్లపుడు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. డోలు చప్పుళ్లకు ఒగ్గు కళాకారులు, యువకులతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి డాన్స్ చేశారు. జారత మహోత్సవానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కురుమ సంఘం పెద్దలకు రూ.60 వేలు, ఒగ్గు కళాకారులకు రూ.30 వేలు అందించారు. జారతరలో చిన్నారులు, మహిళలు, యువకులతో కలిసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. అంతకు ముందు సంగారెడ్డి జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు బురుగడ్డ నగేష్, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్పా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరి, పైతర సాయికుమార్, బీఆర్ఎస్ నాయకులు, పీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ పులిమామిడి రాజు కల్యాణానికి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కురుమ సంఘం నాయకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ కురుమ సంఘం నాయకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.