వరంగల్ ఈస్ట్, మే 25(జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడ నేతన్నలకు తాను బతికున్నంత కాలం అండగా ఉంటానని ఎమ్మెల్యే నన్నపునేని అన్నారు ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ యేలుగం లీలావతి సత్యనారాయణ అధ్యక్షతన తోట మైదానం వేదికగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సుమారు 1300వందల పైచిలుకు నేతన్నలకు బీమా బాండ్లను అందజేశారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ…గతపాలకులు నేతన్నలకు తోడ్పాటును అందిస్తే పాలిస్తే నేతన్నల పరిస్థితి నేడు ఇట్లా ఉండకపోయేదిగతపాలకులు సొసైటీలకు సబ్సిడీ ఇచ్చింది కార్మికులకు ఇవ్వలేదు.నాటి పాలకులు మన గురించి ఏనాడు పట్టించుకోలేదుఆనాడు పరిపాలించినోళ్లు ఓట్ల కోసం చూసిర్రు వాళ్ళ ఎదుగుదలకు నేతన్నలును వాడుకున్నారునిరుపేదలకు సహాయం చేస్తూ వారు మంచిగా ఉన్నరోజు తృప్తిగా అన్నం తిన్నట్టు ఉంటుంది నాకునేను మేయర్ గా ఉన్నప్పుడు నేతన్నల పరిస్థితి బాగాలేదు అని నన్ను అడిగితే కేటీఆర్ దగ్గరకు తీసుకొని పోయి సహాయం చేసాంపద్మశాలిలు నాకు అత్యంత సన్నిహితులుగతంలో ఈ ప్రాంత బిడ్డ విరస్వామి ని ఇక్కడి పరిస్థితి అడిగితే బెడ్ షీట్స్ కార్పెట్స్ కొత్తవాడ ఫెమస్ అని 1995 నుండి విదేశాల నుండి వచ్చి ఖరీదు చేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారని తెలిపారుమరి ఆరోజు ఈ స్థాయిలో ఉన్న కొత్తవాడ పరిశ్రమలు ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందిగతపాలకులు ఎప్పుడు వారి సంపాదన మీదే మక్కువ కాబట్టి ఈ పరిస్థులు నెలకొన్నాయికొందరు గతంలో కులంలో పదవులు వస్తే చాలు అన్ఈ పద్మశాలిల ఎదుగుదలను మరిశీర్రుపద్మశాలకు గౌరవ పదవులు ఇచ్చుకుంటు కింది స్థాయిలో ఉన్న వారిని ప్రభుత్వ ఆదుకుంటుంది1324 మందికి బీమా ఇస్తున్నాంప్రచారం చేసే వాడికి వాళ్ళ పార్టీకి సోయి లేదు కాబట్టి ప్రజల గురించి ఆలోచించలేదు హాస్పిటల్లో 2500వందల ఉద్యోగాలు వస్తాయిహాస్పిటల్ పనులు ప్రారంభం జరిగిన తరువాత ఆటో నగర్ చూట్టు గొప్పగా భూమి విలువ పెరిగింది -ప్రభుత్వం తరపున ఈ విదంగా కూడా లాభం జరుగుతుంది.సంక్షేమ,నిరుపేద నిర్ములన,మీ ఎదుగుదల కోసం కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీస్సులతో ముందుకు సాగుదాం




