Tuesday, 3 November 2026

నేతలంతా…ఉద్యమిస్తేనే తెలంగాణ తథ్యం : కోమిటిరెడ్డి

టీఆర్‌ఎస్‌ వైఖరితోనే విద్యార్థులు ఆత్మ బలిదానాలు
హైదారాబాద్‌ : నవంబర్‌ 8, ( జనంసాక్షి):
నేతలంతా జెండాలు, ఎజెండాలును పక్కనపెట్టి ఉద్యమిస్తే తెలంగాణ తథ్యమని మాజీమంత్రి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమిటరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన గురువారం ఇక్కడ విలేకర్లతో మాట్లడుతూ 2014 దాకా కాలయాపనే ఎజెండాగా తెలంగాణ మంత్రులు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఓట్లు, సీట్లు, పార్టీ బలోపేతం అనటం టీఆర్‌ఎస్‌కు సరికాదని కోమిటిరెడ్డి వ్యాఖ్యనించారు. సీఎం ఎవరన్నది అనవసరమని, తమకు ప్రత్యేక రాష్ట్రమే ప్రధానమన్నారు. తెలంగాణకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుందని కోమిటిరెడ్డి అన్నారు.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నేతలు, టీఆర్‌ఎస్‌ వైఖరితోనే విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని కోమిటిరెడ్డి అన్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *