Thursday, 5 November 2026

నేతాజీ సేవలు మరువలేని.

..

భైంసా రూరల్ జనవరి 23 జనం సాక్షి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ 126 జయంతి ని పురస్కరించుకొని సోమవారం భైంసా పట్టణంలోని కిసాన్ గల్లి నేతాజీ నగర్ సమీపానగల నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి నేతాజీ యువజన సంఘ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ… స్వతంత్ర సమర పోరాటంలో నేతాజీ ది ఘనమైన చరిత్ర అని, దేశం కోసం ఇండియన్ ఆర్మీ స్థాపించి దేశ భద్రతను పెంపొందించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు మరువలేని కొనియాడారు. అనంతరం ప్రసాదవితరణ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ మాశెట్టివార్,టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తోటరాము,నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు కాండ్లిసాయినాథ్, ఉపాధ్యక్షులు విట్టల్,వెటర్నరీ డాక్టర్ విట్టల్,యువజన నాయకులు సూర్యనారాయణ, కార్యవర్గ సభ్యులు కిసాన్ గల్లి వాసులు,రైతుసోదరులు పాల్గొన్నారు.