టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి): టేకులపల్లి ప్రాథమిక పాఠశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను విద్యార్థినీ, విద్యార్థుల మధ్య ఘనంగా నిర్వహించారు. సోమవారం టేకులపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో ప్రధానోపాధ్యాయులు బానోతు లక్ష్మ ఆధ్వర్యంలో నేతాజీ చిత్రపటానికిపూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపన్యాసంలో విద్యార్థులకు నేతాజీ గురించి వివరిస్తూ భారత స్వాతంత్ర సమరయోధుడు, ఆజాద్ హిందూ ఫౌజ్ వ్యవస్థాపకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని, ఆయన స్వాతంత్ర సమరంలో అలుపెరుగని పోరాటం చేశారని, చరిత్రలో నిలిచిపోయిన యోధుడని, ఆయన అడుగుజాడల్లోనే యువత పయనించాలని హెచ్ఎం బానోతు లక్ష్మ అన్నారు. ఈ కార్యక్రమంలో భవిత పాఠశాల ఉపాధ్యాయులు రవీందర్, పద్మ, పాఠశాల సిబ్బంది, భద్రమ్మ, సుజాత,విద్యార్థి,విద్యార్థులు పాల్గొన్నారు.




