నేను అతిథినే కదా.. అందుకే ‘మా’ సభ్యత్వానికి రాజీనామా


` ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్‌రాజ్‌ రాజీనామా
హైదరాబాద్‌,అక్టోబరు 11(జనంసాక్షి): ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మా’ ఎన్నికలు సజావుగా సాగాయని, ఎన్నికల్లో ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కు వినియో గించుకున్నారని అన్నారు. మంచు విష్ణు ఇచ్చిన హావిూలను నెరవేర్చాలని కోరారు. రాజీనామా నిర్ణయం బాధతో తీసుకున్నది కాదని తెలిపారు. తెలుగువాడిగా పుట్టకపోవడం తన దురదృష్టమన్నారు. అతిథిగా వచ్చానని, అతిథిగానే ఉంటానని ప్రకటించారు. ప్రాంతీయత ఆధారంగా ఎన్నికలు జరిగాయని అన్నారు. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు.
విూరిచ్చిన హావిూలు నెరవేర్చండి..
‘‘మా ఎన్నికలు బాగా జరిగాయి. ఎప్పుడూ లేనంత చైతన్యంతో దాదాపు 650మంది ఈ ఎన్నికల్లో పాల్గొన్నారు. మంచు విష్ణు, శివబాలాజీ రఘుబాబుతో సహా గెలిచిన వారందరికీ పేరు పేరునా శుభాకాంక్షలు. విూరు అతి పెద్ద ప్రణాళికతో వచ్చారు. విూరిచ్చిన హావిూలు నెరవేర్చండి. కానీ, ఈ రోజు నేను తెలుగువాడిని కాదు, ప్రాంతీయత, జాతీయవాదం వీటి నేపథ్యంలో మా ఎన్నికలు జరిగాయి. ‘తెలుగు వ్యక్తి కాని వాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు’ అనే నినాదం ప్రారంభించారు. విూరు వచ్చిన తర్వాత ఆ నిబంధనలు మారుస్తానని కూడా చెప్పారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం నా తప్పు, వాళ్ల తప్పు కూడా కాదు. అసోసియేషన్‌కు నాయకత్వం తెలుగువారికే ఉండాలని అన్నారు. దాన్ని మెంబర్స్‌ ఆమోదించారు. తెలుగుబిడ్డ, మంచి వ్యక్తిని ఎన్నుకున్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నా’’
కొందరు నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు..
‘‘ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. వచ్చే రోజుల్లో నేను అతిథిగా ఉండాలంటే అసోసియేషన్‌ మెంబర్‌గా ఉండకూడదు. కొందరు నన్ను అతిథిగా మాత్రమే ఉండమన్నారు. పెద్ద నటులు మోహన్‌బాబుగారు, కోటగారు, చలపతిరావు తనయుడు రవి వీళ్లంతా ‘అతిథిగా వస్తే, అతిథిగానే ఉండాలి’ అని చెప్పారు. అలాగే ఉంటా. విూరు అనుకున్నది జరిగింది. ‘మా’ ఎన్నికల్లో జాతీయవాదం వచ్చింది. భాజపా నేత బండి సంజయ్‌లాంటి వాళ్లు ట్వీట్‌ చేశారు. ఎలా ఓడిపోయాం. ఎలా గెలిచాం అన్నది ముఖ్యం కాదు. ఎన్నికలు జరిగాయి. వాళ్లు గెలిచారు. ‘మా’తో నాకు 21ఏళ్ల అనుబంధం. జీవితం ఎంతో అందమైనది’’
నాకు ఏకగ్రీవం నచ్చదు..
‘‘ఏది చెప్పినా, ఎవరు చెప్పిన ‘మా’ సభ్యుల నిర్ణయం అంతిమం. నాగబాబుగారి ఒక్క ఓటు వల్ల గెలవలేను కదా! ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీసుకున్న నిర్ణయం పట్ల నేనేవిూ విచారపడటం లేదు. ఎన్నికల ముందు ఏం చెప్పానో దానికి కట్టుబడి ఉంటా. నేను ‘మా’ సమస్యల గురించి మాట్లాడా. ఏం చేయాలో చెప్పాను. కానీ ‘మా’ సభ్యులు ఇంకో నిర్ణయాన్ని తీసుకున్నారు. దాన్ని గౌరవిస్తా. నాకు ఓటు వేసిన వాళ్లకు థ్యాంక్స్‌. ఈ ఎన్నికలేవిూ కురుక్షేత్ర సంగ్రామం కాదు. తెలుగు సినిమాల్లో నటించే విషయంలో నా అభిప్రాయం ఏవిూ మారదు. తెలుగు కళాకారులతో కలిసి పనిచేస్తా. ఏ విషయంలోనైనా నాకు ఏకగ్రీవం నచ్చదు. బహుశా వచ్చే ఎన్నికల నుంచి మోహన్‌బాబు గారు చెప్పినట్లు ఏకగ్రీవం జరుగుతుందేమో. నాకు అందులో భాగస్వామ్యం అవడం ఇష్టం లేదు. నేను యూనివర్సల్‌ నటుడిని. తెలుగు కాని నటులు సినిమాల్లో చేయొద్దని విష్ణు టీమ్‌ కూడా చెప్పలేదు. ఇతర భాషల్లో నటించే వారితో కలిసి అసోసియేషన్‌ పెట్టేంత సంకుచిత మనస్తత్వం కాదు నాది’’‘‘సాధారణ ఎన్నికల్లోనూ నేను ఓటమి పాలయ్యా. అలాగని రాజకీయాలు వదిలేయలేదు కదా! ఇది కూడా అంతే. అసోసియేషన్‌ నుంచి మాత్రమే బయటకు వచ్చా. తెలుగు సినిమాల్లో నటిస్తా. ‘మా’ ఎన్నికల్లో రాజకీయాలు వచ్చాయి. నాకు అబద్ధాలు చెప్పడం రాదు. నా దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకుల నుంచి దూరం చేస్తే చేయనీయండి. ఈ ఎన్నికల్లో నేనేవిూ బాధితుడిని కాదు. సినిమాల పరంగా, పాత్రల పరంగా వచ్చే రెండు సంవత్సరాల్లో నేనేంటో చూస్తారు. అసోసియేషన్‌ వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. నేను ‘మా’సభ్యుడిని కాకపోయినా మంచు విష్ణు చేసే సినిమాల్లో నటించమంటే నాకేవిూ అభ్యంతరం లేదు. నేను ఓడిపోవటానికి వంద కారణాలు ఉంటాయి. నేను నేనుగా బతికా. నేను నేనుగా ఉంటా.. ఇప్పుడే మొదలైంది.. థ్యాంక్యూ’’ అని అన్నారు.