– టీడీపీ నకిలీ సభ్యత్వ కార్డు తయారీపై విచారణ చేపట్టిన పోలీసులు
– హాజరై వివరణ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్
గుంటూరు, నవంబర్6(జనంసాక్షి) : జగన్‌పై దాడి ఘటనకు సంబంధించిన శ్రీనివాసరావు పేరుతో నకిలీ కార్డు తయారు చేశారంటూ టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరుగుతున్న విచారణకు వైసీపీ నేత జోగిరమేష్ హాజరయ్యారు. జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సభ్యత్వం కలిగి ఉన్నాడంటూ నకిలీ సభ్యత్వం తయారు చేసి వైసీపీ సోషల్ విూడియాలో విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ వ్యవహారంపై గత 28న అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో టీడీపీ నేతలు వర్ల రామయ్య, పలువురు నేతలు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేత జోగిరమేష్ నకిలీ కార్డు చూపిస్తూ విూడియా సమావేశం నిర్వహించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జోగి రమేష్‌కు అరండల్‌పేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు సిద్ధమైన జోగిరమేష్ ఉదయం తన అనుచరులతో కలిసి విజయవాడ నుంచి గుంటూరుకు చేరుకున్నారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదు – జోగిరమేష్
జగన్‌పై దాడి కేసులో నిందితుడు శ్రీనివాసరావు టీడీపీ సభ్యత్వ కార్డుకు సంబంధించి సోషల్ విూడియాలో వైరల్ అవుతున్న అంశాన్నే ప్రెస్‌విూట్‌లో చూపించానని వైసీపీ నేత జోగి రమేష్ తెలిపారు. తాను ఎలాంటి తప్పుచేయలేదని స్పష్టం చేశారు. జగన్‌పైదాడి కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. అధికార పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, టీడీపీ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందని జోగి రమేష్ అన్నారు.
నేను ఎలాంటి తప్పు చేయలేదని వెల్లడి




