నేను మీ బిడ్డను “-జల్లి సిద్దయ్య” – -జిల్లా న్యాయవాదుల మద్దతు జల్లి సిద్దయ్యకె

జనగామ నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ జనగామ స్థానికులు అయిన హైకోర్టు సీనియర్ న్యాయవాది జల్లి సిద్దయ్యకు బిఆరెస్ అభ్యర్థిత్వానికి జనగామ జిల్లా న్యాయవాదులు మద్దతు ప్రకటించారు. శుక్రవారం జనగామ జిల్లా కేంద్రంలోని శుక్రవారం ఓ వేడుకల మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో న్యాయవాదులు మద్దతు తెలుపుతూ ప్రసంగించారు.అనంతరం జల్లి సిద్దయ్య మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం తరిగొప్పుల చెందిన వారినని, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి వెన్నంటి ఉన్నానని, తన ఎమ్మెల్యే అభ్యర్థిద్వాంపై పరిశీలన చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ని కోరారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో జనరల్ సెక్రెటరీగా చేశానని అదేవిధంగా సీఎం కేసీఆర్ టీఆరెస్ పార్టీలో బీసీ కమిటీ12మంది తో వేయగా ఆ కమిటీకి చైర్మన్ గా చేశారని గుర్తు చేశారు.గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు మద్దూరు జెడ్పిటిసిగా నిలబడి గెలిచానన్నారు.అదే మాదిరిగా గతంలో పాలకుర్తి నియోజకవర్గ తెరాస అభ్యర్థిగా పార్టీ టిక్కెట్ కేటాయించారు అని కాకపోతే స్థానికత వ్యవహారం వలన నిలబడలేదన్నారు.సీఎం కేసీఆర్ జనగామ టిక్కెట్ విషయంలో తనకు కేటాయింపు కొరకు పరిశీలించాలని,అదేవిధంగా జనగామ జిల్లా న్యాయవాదులు తనకు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లాయర్ అశోక్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కురేళ్ల శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రాజయ్య , సీనియర్ న్యాయవాదులు ,రాం మోహన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సూదిరంజన్ ,రాంమోహన్ రెడ్డి, మాజీ పిపి లు హరిశ్చంద్ర ప్రసాద్, విరమల్లయ్య, శ్రీనివాస్,మహిళా న్యాయవాదులు స్వప్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు