హైదరాబాద్: భూకంప బాధితులను ఆదుకోడానికి భారత రాష్గాలు ముందుకొచ్చాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ నుంచి వైద్య బృందాలను నేపాల్ పంపినట్లు ఆ రాష్గాల అధికారులు తెలిపారు. వారితో పాటు వైద్య సామాగ్రి, ఆహార పదార్థాలు, తాగునీటిని కూడా బాధితులకు అందించే ఏర్పాట్లు చేశారు.భూకంప బాధితుల సహాయార్థం ఇప్పటికే భారత్ సహా అమెరికా తదితర దేశాలు సహాయక సిబ్బందిని పంపిన విషయం తెలిసిందే.




