ఖాట్మండ్: నెపాల్ రాజధాని ఖాట్మండ్‌కు సమీపంలో ఓ విమానం ఈ ఉదయం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 19 మంది మృతి చెందారు. సిట ఎయిర్ సంస్థకు చెందిన రెండు ఇంజిన్‌లతో కూడిన విమానం ఖాట్మండ్ ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ప్రమాదానికి గురైంది. మనోహర నది సమీపంలో విమానం నేల కూలినట్లు అధికారులు ధ్రువీకరించారు. ఖాట్మండ్ నుంచి ఈ విమానం ఎవరెస్ట్‌కు ముఖద్వారమైన ప్రముఖ పర్యాటక ప్రాంతం లుక్లాకు వెళ్తోంది. ఘటనాస్థలికి చేరుకున్న సైన్యం సహాయక చర్యలు చేపట్టింది.




