హైదరాబాద్: నేపాల్ భూ విలయం నుంచి తప్పించుకొని తమిళనాడుకు చెందిన 32మంది సురక్షితంగా వారి స్వస్థలానికి చేరుకున్నారు. నేపాల్ రాజధాని కాఠ్మాండూ విమానాశ్రయం నుంచి దిల్లీకి చేరుకున్నవారిని అక్కడి నుంచి మరో విమానంలో చెన్నైకి పంపినట్లు అధికారులు తెలిపారు. తమిళనాడుకు చెందిన మరికొంతమందిని కూడా త్వరలోనే స్వస్థలానికి చేర్చుతామని అధికారులు తెలిపారు. నేపాల్లో తమిళనాడు రాష్గానికి చెందిన వారు మొత్తం 311మంది చిక్కుకుపోయారని, వారిని సురక్షితంగా స్వస్థలానికి తీసుకురావడానికి ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.




