Tuesday, 3 November 2026

నేరమయ రాజకీయాలపై తెదేపా ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పెరుగుతున్న నేరమయ రాజకీయాలకు నిరసనగా గస్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేలు, ఎమ్యెల్సీలు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా తెదేపా సీనియర్‌నేత మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ… సకల జనుల సమ్మె వైఫల్యమవడానికి కేసీఆర్‌ కారణమని ఆరోపించారు. కేసీఆర్‌కు తెలంగాణ రావడం ఇష్టం లేదన్నారు. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఉద్యమం కావాలో, సెటిల్‌మెంట్లు కావాలో తెరాస తేల్చుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *