Tuesday, 3 November 2026

పాఠశాల బస్సు దగ్ధం : విద్యార్థులు సురక్షితం

అబ్దుల్లాపూర్‌మెట్‌ (రంగారెడ్డి): హయత్‌నగర్‌ మండలం బాటసింగారం వద్ద గురువారం ఉదయం ప్రైవేటు పాఠశాల బస్సు పూర్తిగా దగ్ధమైంది. పోచంపల్లి నుంచి వనస్థలిపురం వైపు వస్తున్న బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ బస్సును నిలిపివేసి అందులో ఉన్న 30 మంది విద్యార్థులను స్థానికుల సాయంతో క్షేమంగా కిందికి దించాడు. ప్రమాదానికి గురైన బస్సు వనస్థలిపురంలోని స్పూత్నిక ఇంటర్నేషనల్‌ స్కూల్‌దిగా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *