Wednesday, 4 November 2026

రైలు ప్రమాదం దురదృష్టకరం : మంత్రి పల్లె

7ay15pimఅనంతపురం : మడకశిర వద్ద జరిగిన రైలు ప్రమాదం దురదృష్టకరమని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. ఆయన టెన్ టివితో మాట్లాడుతూ ఈ ప్రమాదంలో నలుగరు చనిపోయారని, మరో ముగ్గురు గాయపడినట్లు తెలిపారు. ఆయన అనంతపురం నుండి హైదరాబాద్ కు మరో రైల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రమాదం జరిగిన సమాచారం అందడంతో గుంతకల్లు రైల్వే స్టేషన్ వద్ద ఆగిపోయారు. అక్కడ నుండి కాసేపట్లో పెనుకొండకు వెళ్తున్నట్లు తెలిపారు. గ్రానైట్ లారీ బ్రేక్ ఫెయిల్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగిన ట్లు ప్రాథమిక సమాచారంగా తెలుస్తోంది. విచారణలో పూర్తి వివరాలు తెలుస్తాయని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా పెనుకొండ రైల్వే జోన్ లో తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని… వీటి పై కేంద్రానికి ఓ లేఖ రాయనున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చనిపోయిన వారికి, క్షతగాత్రులను ఆదుకుంటామని పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *