కోటగిరి ఫిబ్రవరి 28 జనం సాక్షి:-నిజామాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఅర్ నాగరాజు ఆదేశాల మేరకు ఉమ్మడి కోటగిరి మండలంలోని దోమలేడిగి గ్రామంలో స్థానిక ఎస్ఐ మచ్చెంధర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందం వారు ప్రజలకు సైబర్ నేరాలు, మత్తు పదార్థాల వినియోగంపై కలిగే అనర్థాలు, బాల్య వివాహాలు,షీ టీమ్స్,సీసీ కెమెరాలపై అవగాహన నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ఐ మచ్చెందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.సైబర్ నేరగాళ్లు చూపే మోసపూరిత ఆశలకు అందరు తస్మాత్ జాగ్రత్త వహించాలన్నారు.సైబర్ నేరాలకు గురైతే 1930 లేదా 100 నంబర్‌కి డయల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు.దొంగతనాల నిర్మూలన కోసం ప్రజలందరూ సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం లో ముందుకు రావాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,కళాబృంద సభ్యులు,స్థానిక ప్రజా ప్రతినిధులు,ప్రజలు పాల్గొన్నారు.
నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.ఎస్ఐ మచ్చెంధర్ రెడ్డి.




