నోముల భగత్ కు ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పట్ల టిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు

తిరుమలగిరి (సాగర్) ఆగస్టు 21 (జనంసాక్షి): ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సోమవారం నోముల భగత్ కు నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ప్రకటించడం పట్ల బి ఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో పార్టీ అధ్యక్షుడు పిడిగం నాగయ్య ఆధ్వర్యంలో బాణాసంచాలు కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం నాగయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి భగత్ పై నమ్మకం ఉంచి మరోసారి టికెట్ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త ఎమ్మెల్యే నోముల భగత్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోతుగంటి తిరుమల్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు చెవ్వ నాసర్ రెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు షాగం అంజిరెడ్డి,రైతు సంఘం అధ్యక్షులు పగడాల పెద్దిరాజు, యూత్ అధ్యక్షులు జటావత్ రమేష్ నాయక్, బీసీ సెల్ అధ్యక్షులు కార్తీక్ గౌడ్,రైతు అధ్యక్షులు కోటిరెడ్డి,మల్లికార్జున్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలేపల్లి సత్తయ్య,హాలియా మార్కెట్ డైరెక్టర్ జాతవత్ చందర్, సీత్య నాయక్,శంకర్ నాయక్, సర్పంచులు సపవత్ స్వామి, జాతవత్ స్వామి, జగిని జోగానాయక్,వాడిత్య పాండు,దేవుడు. తదితరులు పాల్గొన్నారు.