మెరుగైన చికిత్స కోసం ఎల్వోసి అందజేసిన మంత్రి కొప్పుల

ధర్మపురి (జనం సాక్షి) ‌ధర్మపురి నియోజకవర్గం జూలపెల్లి మండలం అబ్బాపూర్ చెందిన సి. సంధ్యా నిమ్స్ హస్పిటల్ లో మెరుగైన వైద్యచికిత్స నిమిత్తం రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు 1లక్ష 50 రూపాయల ఎల్వీసీ మంజూరు చేయించారు.
ఎల్ఓసి కాపీని సంధ్య కుటుంబ సభ్యులకు మంత్రి సోమవారం నాడు హైదరాబాద్ లో అందజేశారు. మెరుగైన వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి మనో ధైర్యం చెప్పారు. నిరుపేదలమైన మాకు మెరుగైన వైద్య చికిత్స కొరకు ఎల్ఓసి మంత్రి మంజూరు చేశారని.. మంత్రి కొప్పుల ఈశ్వర్ మేలు మర్చి పోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.