హైదరాబాద్, ఆగస్టు13: హయత్‌నగర్‌లోని నోవా ఇంజినీరింగ్ కాలేజీలో ఘర్షణ వాతావరణం నెలకొంది. బీహార్, తెలంగాణ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. కళాశాల యాజమాన్యం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గాయబడిన విద్యార్థులను యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.




