న్యాక్‌ కేంద్ర తరలింపును అపాలి

గోదావరిఖని : ఎఫ్‌సీఐ టౌన్‌షిప్‌లో నిర్వహిస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని తరలించవద్దని తెలుగు యువత అద్వర్యంలో ధర్నా చేపట్టారు. నాలుగేళ్లుగా స్థానిక నిరుద్యోగుల అవసరాలను తీరుస్తున్న న్యాక్‌ కేంద్రాన్ని తరలించడం సమంజసం కాదన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు శంకర్‌, కృష్ణా, గంగరాజు తదితరులు పాల్గోన్నారు.