Tuesday, 3 November 2026

న్యూ ఇయర్‌ కోసం ప్రత్యేక రైళ్ళు

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా పలు మార్గాల్లో 78 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నల్లగొండ, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ మార్గంలో కాచిగూడ – టాటానగర్‌, టాటానగర్‌ – కాచిగూడ మధ్య 26 సర్వీసులు, ఖమ్మం, రయనపాడు, దువ్వాడ, శ్రీకాకుళం, ఖుర్దారోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌ – భువనేశ్వర్‌, భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ మధ్య 36 సర్వీసులు, నల్లగొండ, గుంటూరు, పాలకొల్లు మార్గంలో నర్సాపూర్‌ – హైదరాబాద్‌, మధ్య 4 ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ – విజయవాడ మధ్య 4 సర్వీసులు, మచిలీపట్నం – సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌ – మచిలీపట్నం మధ్య 8 సర్వీసులు రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు.