Tuesday, 3 November 2026

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌ : పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల అధికారి రమాకాంత్‌రెడ్డి ఈరోజు విడుదల చేశారు. ఈనెల 9న జిల్లా కలెక్టర్లు ఆయా జిల్లాల వారీగా నోటిఫికేషన్‌ విడుదల చేస్తారని తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 21,491 పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొత్తం గ్రామ పంచాయతీల్లో 2,17,578 వార్డులను పోలింగ్‌ నిర్వహిస్తారు. తొలి విడత ఈనెల 23న, రెండో విడత 27న, మూడో విడత 31న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి వరకూ పోలింగ్‌ జరుగుతంది. నామినేషన్ల స్వీకరణకు ఈనెల 13 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన ఈనెల 14న, ఉపసంహరణకు ఈనెల 17 చివరి తేదీగా నిర్ణయించారు. ఈరోజు నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుంది. ఫలితాలు విడుదలయ్యే వరకూ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని రమాకాంత్‌రెడ్డి తెలిపారు. బ్యాలెట్‌ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. గ్రేటర్‌లో కలిపే పంచాయతీలకు ఎన్నికల నుంచి మినహాయింపు ఉంటుందని ఈసీ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *