పెనుబల్లి, జులై 7(జనం సాక్షి)
పెనుబల్లి మండలంలో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె రెండో రోజు చేరుకుంది,శుక్రవారం
మండలంలో33 గ్రామపంచాయతీల కార్మికులు ఉద్యోగులు అందరూ సమ్మెలో పాల్గొన్నారు,
ఎండిఓ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నందు ధర్నా నిర్వహించి, ఎండిఓ కార్యాలయం నుండి వి.ఎం. బంజర్ రింగ్ సెంటర్ వరకు ప్రదర్శన నినాదాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేసి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నాయకులు రంగయ్య అధ్యక్షతన సభ నిర్వహించడం జరిగింది. ఈ సభలో సిఐటియు ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు చలమాల విఠల్రావు మాట్లాడుతూ, పల్లెలను శుభ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను పెంచుతూ పంచాయతీ కార్మికులుశ్రమ చేస్తుంటే వారి జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని, కనీస ఉద్యోగ భద్రత గాని , గుర్తింపు కార్డులు గానీ, పిఎఫ్.సౌకర్యం గాని, ఈఎస్ఐ సౌకర్యమును కానీ లేవని, దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారని, ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, అందరికీ 19 వేల రూపాయల వేతనం ఇవ్వాలని, ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు వర్తింప చేయాలని, ఈ డిమాండ్ సాధన కోసం సాగుతున్న సమ్మెను విచ్ఛిన్నం చేయటం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని, జిపి కార్మికుల ఐక్యతతో ముందుకు సాగుతూ విజయం సాధిస్తామని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిపి కార్మికులు రంగయ్య, చీపీ మారేశ్వరావు, వెంకటేశ్వరావు , రాజీని వెంకటేశ్వరావు, బద్రు నాయక్,వంగ అశోక్, గోనెల రామారావు, తడికమల్ల సుధాక ర్, ఏసోబు, అశోక్ , ఏసు, ఇజ్రాయిల్,తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు.




