Wednesday, 4 November 2026

కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తాను. -డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డిఎస్ జగదీష్

డోర్నకల్, జులై/7/జనం సాక్షి న్యూస్:
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పట్టణ కేంద్రంలో డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక కాబడిన ధరమ్ సోత్ జగదీష్ నాయక్ ను డోర్నకల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో ఘన సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంధర్బంగా జగదీష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం కష్ట పడడానికి అవకాశం ఈచిన రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ కి,డోర్నకల్ అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి మాలోతు నెహ్రూ నాయక్ ,మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ,డీసీసీ అధ్యక్షుడు భారత్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్ట పాడుతా అని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు తారా చంద్,ఉపేందర్,ఖాదర్ బాబా,హరికృష్ణ,శ్రీను,అనిల్,వీర స్వామి,ప్రవీణ్,హనుమంతు,సురేష్,నరేష్,కళ్యాణ్,శంకర్,నరేష్,భావ సింగ్, విజయ్,శ్రీను, దేవజి,రాంబాబు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.