Tuesday, 3 November 2026

పంచాయతీ కార్యదర్శుల నిరవదిక సమ్మెకు శ్రీను బాబు మద్దతు

 

 

 

 

 

జనంసాక్షి, రామగిరి : పెద్దపల్లి జిల్లా రామగిరి మండల కేంద్రములో పంచాయతీ జేపియస్, ఓపియస్ ల శాంతియుత నిరవధిక సమ్మెకు దుద్దిల్ల శ్రీను బాబు బుధవారం సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీను బాబు మాట్లాడుతూ… జూనియర్ ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శుల సర్వీస్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీకరించాలని, ఓపిఎస్ ను వెంటనే జెపిఎస్లుగా కన్వర్ట్ చేసి, వెంటనే రెగ్యూలర్ చేయాలని శ్రీను బాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్య దర్శులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పక్షాన అండగా నిలబడతామని శ్రీను బాబు అన్నారు.