Tuesday, 3 November 2026

జంట హత్యల కేసును చేదించిన పోలీసులు48 గంటల లోనే కేసును చేదించిన జిల్లా పోలీసులు* నలుగురి పై కేసు నమోదు

 

 

 

 

 

 

,గుడిహత్నూర్: మే 2 (జనం సాక్షి )మండలంలోని గర్కంపేట్ సమీపంలో రెండు రోజుల క్రితం కలకలం రేపిన జంట హత్యల కేసును జిల్లా పోలీసులు 48 గంటల్లోనే చేదించారు.ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి  జిల్లా కేంద్రంలోని హెడ్ క్వార్టర్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  జంట హత్యల వివరాలను వెల్లడించారు.ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వివరాల ప్రకారం  కేఆర్ కే  కాలనీకి చెందిన  అశ్వినికి సుందరయ్య నగర్ కాలనీకి చెందిన సోన్ కాంబ్లే రమేష్ తో   పన్నెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది.గత మూడు నెలల నుండి సోన్ కాంబ్లే అశ్విని, మహమ్మద్ రహమాన్ మరియు ఇతరులతో సన్నిహితంగా ఉంటుందని అనుమానంతో భార్య భర్తల మధ్య గొడవలు జరగగా అశ్విని గత మూడు నెలల నుండి తన తండ్రి రావుసాబ్ వద్దే ఉంటుంది. అశ్విని ఇతరులతో తిరుగుతున్న విషయాన్ని  రమేష్ తన చెల్లెలు స్వప్న, షీలా మరియు బావ వెంకటేష్ కు చెప్పగా అశ్విని వారి పరువు తీస్తుందని ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 28వ తేదీన ఉదయం రమేష్ తన కొడుకు  లోకేష్ తో కలిసి కేఆర్ కే కాలనీకి వెళ్లి ఉదయం తాను కిరాయికి తీసుకున్న ఇల్లు శుభ్రం చేయడానికి అశ్విని వస్తుందని తన మామ రావుసాబ్ కు ఫోన్ చేసి చెప్పగా  అశ్విని బయలుదేరి చాలాసేపు అయిందని మామ సమాధానం ఇవ్వగా రమేష్ కు అనుమానం వచ్చి మీ అమ్మ గతవారం ఎక్కడికి వెళ్ళిందో నీకు గుర్తుందా అని కొడుకు లోకేష్ ను అడగగా అవును నాకు గుర్తుంది అమ్మ ఎక్కడికి వెళ్లిందో చూపిస్తానని ఆదిలాబాద్ నుండి ఆటోలో కొడుకు లోకేష్ చెప్పిన ప్రకారంగా గుడిహత్నూర్  మండలంలోని సీతాగొంది పరిధిలోని గర్కంపేట్ కు వచ్చారు.రోడ్డు కుడి వైపు వేప చెట్టు కింద స్కూటీ కనబడగానే రమేష్ కొడుకు డాడీ మేము ఇంతకుముందు వచ్చిన స్కూటీ ఇదే అని రమేష్ కు చూపించగా, స్కూటీ ఉన్న ప్రదేశం నుండి కుడివైపు కొంత దూరం వెళ్ళి పొదలలో వెతుకుతుండగా రమేష్ భార్య  అశ్విని, రహమాన్ సన్నిహితంగా ఉండడం చూసి  తన ఇద్దరు చెల్లెలు మరియు బావకి ఫోన్ చేసి పిలవగా, వారు ఆదిలాబాద్ నుండి రమేష్ ఉన్న ప్రదేశంలో ఆటోలలో చేరుకున్నారు.అందరూ కలిసి మృతులు అశ్విని మరియు రెహమాన్ ను  ఎలాగైనా చంపాలని  నిర్ణయించుకున్నారు. అక్కడే ఉన్న కర్రను రమేష్ తీసుకొని  మృతులు సాన్నిహితంగా  ఉన్న సమయంలో వెనుక నుండి రెహమాన్ తలపై కొట్టి చంపగా, అదే సమయంలో అశ్విని అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా రమేష్ చెల్లెలు మరియు బావ పట్టుకోగా రమేష్ మృతురాలు అశ్విని నోదటిపై తల వెనుక భాగంలో బలంగా కర్రతో కొట్టి చంపేశాడు.ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్లను రప్పించి డి.ఎస్పి ఉట్నూర్, సిఐ ఇచ్చోడ, గుడిహత్నూర్ ,నెరడిగొండ ఇంద్రవెల్లి, సిరికొండ, ఎస్సైలతో ఆరు టీంలను ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరం జరిగిన 48 గంటలను కేసును చేదించి నేరస్తులను పట్టుకోవడం జరిగిందన్నారు.కేసును  ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన పోలీసులందరిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఉట్నూర్ డి.ఎస్పిసిహెచ్ నాగేందర్, ఇచ్చోడా సీఐ ముదావత్ నైలు, సిసిఎస్  ఇన్స్పెక్టర్ చంద్రమౌళి, గుడిహత్నూర్, ఎస్సై ప్రవీణ్ కుమార్ఇంద్రవెల్లి, ఎస్సై సునీల్ సిరికొండ, ఎస్సై నీరేష్ నేరడిగొండ, ఎస్సై సాయన్న ఎస్సై లు మరియు పోలిసు సిబ్బంది పాల్గొన్నారు.