Tuesday, 3 November 2026

పంచాయతీ కార్యదర్శుల నిరసన

 

 

 

 

 

 

వేమనపల్లి,ఏప్రిల్ 28,(జనంసాక్షి):జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులను వెంటనే రెగ్యులర్‌ చేయాలని తెలంగాణ రాష్ట్ర పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ వేమనపల్లి మండల అధ్యక్షుడు తోడే సంతోష్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి సిరాజ్ డిమాండ్‌ చేశారు.తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపి మండల పంచాయతీ అధికారి కార్యాలయంలో సమ్మె నోటీస్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శుల ప్రొబేషనరీ కాలం పూర్తిఅయ్యి నాలుగేళ్లు అవుతున్నా తమ ఉద్యోగాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జీవో జారీ చేయకుండా కాలయాపన చేస్తోందన్నారు.జీవో26 ప్రకారమే తమను రెగ్యూలరైజ్‌ చేయకుండా తాత్సారం చేయడం తగదన్నారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తూ జీ వోను విడుదల చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామపంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.