Tuesday, 3 November 2026

అనారోగ్యంతో ప్రధానోపాధ్యాయురాలు మృతి.

 

 

 

 

 

 

 

 

నెన్నెల, ఏప్రిల్ 28, (జనంసాక్షి )నెన్నెల మండలం కుశ్నపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వరాజ్య లక్ష్మి కాన్సర్ బారిన పడి హైదరాబాద్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. అందరితో కలుపుగోలుగా ఉండి విద్యా బుద్దులు నేర్పించే ఉపాధ్యాయురాలు ఇలా హాఠాత్మరణం చెందడంతో ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ సింగతి శ్యామల వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.