హైదరాబాద్: ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా పంజాబ్‌లో రైతులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు 7 రైళ్లు రద్దు కాగా, మరో 12రైళ్లను అధికారులు దారి మళ్లించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు, రేపు ఆందోళనలు చేపట్టనున్నట్లు రైతు సంఘాల ప్రతినిధులు వెల్లడించారు.




