Wednesday, 4 November 2026

పంటలు బాగా పండాలి.. రైతులుసుభిక్షంగా ఉండాలి – మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు

 జనంసాక్షి, కమాన్ పూర్ : కమాన్ పూర్ మండలంలోని కమాన్ పూర్ గ్రామములో శ్రీ భూలక్ష్మి ,శ్రీ లక్ష్మి సహిత గ్రామ శిలా బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం, పోచమ్మ కొలుపు కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి,మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
గ్రామ దేవతల అనుగ్రహంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎల్లప్పుడు సుఖ సంతోషాలతో ఆనందాలతో సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండెలా చూడాలని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఆనంతరం ఉత్సవ కమిటీ నిర్వాహకులు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు, నాయకులు కోలేటి మారుతి, రంగు సత్యనారాయణ, భూoపెళ్ళి రాజయ్య,గండ్ల మోహన్ ,మల్యాల తిరుపతి పెండ్యాల రాజు , అబ్దుల్ రఫీక్,సయ్యద్ ఇక్బాల్ ,జంగిలి కనకయ్య, అఫ్సర్,,కుక్క రవి ,పంజా సాయిరాం తదితరులు ఉన్నారు.