జనంసాక్షి, కమాన్ పూర్ :
కమాన్ పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రీ భూలక్ష్మి, శ్రీలక్ష్మి సహిత గ్రామశిల ( బొడ్రాయి ) విగ్రహ ప్రతిష్టపన మహోత్సవ, పోచమ్మ కొలుపులో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషలతో ఉండాలని, గ్రామ దేవతల చల్లని చూపుతో పాడి పంటలుతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు. అనంతరం సునీల్ రెడ్డిని ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
గ్రామ దేవతల దీవెనలు అందరిపైన ఉండాలి – బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి




