వేములవాడ ఏప్రిల్ 27 (జనంసాక్షి) వేములవాడ పట్టణం లో స్థానిక సిఐటియు కార్యాలయం లో విలేకర్ల సమావేశం నిర్వహించారు, ఈ సందర్బంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ముక్తికాంత అశోక్ లు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వరి పొలాలు, మామిడి తోటలు, కూరగాయ తోటలు పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది అని ప్రభుత్వము వెంటనే వ్యవసాయ అధికారులతో సర్వే చేపట్టి నష్టపోయిన రైతులకు ఎకరాల 25 వేల చొప్పున ఇవ్వాలని రైతు సంఘం, సిఐటియు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది అలగే రైతులు క్రాప్ లోను తీసుకునేటప్పుడు బ్యాంకు వాళ్లు వరి పంట , పత్తి పంట గాని ఇన్సూరెన్స్ చేయించుకోవడం అనేది ఉంది కానీ రైతులు వేసిన పంటలు అతి వృష్టి, అనావృష్టితో నష్టపోయిన రైతులకు ఇన్సూరెన్స్ వర్తింప చేయడం లేదు అని వెంటనే వ్యవసాయ అధికారులు గ్రామ గ్రామాన తిరిగి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం తో పాటు పంట ఇన్సూరెన్స్ కూడా ఇప్పించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.




