చీఫ్ సూపర్డెంట్ రిజ్వాన సమీరా.
కోటగిరి మార్చి 15 జనం సాక్షి:-పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా తొలి రోజు పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభ మైనట్లు పరీక్షల చీఫ్ సూపర్డెంట్ రిజ్వాన సమీరా పేర్కొన్నారు.బుధవారం కోటగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రంలో కోటగిరి టెమ్రీస్,ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన 229 మంది మొదటి సంవత్సర విద్యార్థులు ప్రథమ సబ్జెక్ట్ అయినా తెలుగు,ఉర్దూ,హిందీ,జిఎఫ్సి-1 పరీక్షలను విజయవంతంగా రాశారు.ఈ సందర్భంగా చీఫ్ సూపర్డెంట్ రిజ్వాన సమీరా,పరీక్ష ప్రత్యేక అధికారి ఎం.గంగాధర్ మాట్లాడుతు.ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం తొలి పరీక్షలు కోటగిరి పరీక్ష కేంద్రంలో ప్రశాంతంగా కొనసాగాయన్నారు.నిమిషం ఆలస్యమై నా అనుమతించబడదనే నిబంధనతో విద్యార్థులు పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకున్నారనీ తెలిపా రు.ఈ పరీక్ష కేంద్రానికి 237 మంది విద్యార్థులు హాజరు కావల్సింది ఉండగా అందులో 229 మంది విద్యార్థులు పరీక్షకు హాజరై,08 మంది విద్యార్థులు గైర్హాజరైనారని తెలిపారు.పరీక్ష కేంద్రాల వద్ద గల జిరాక్స్ కేంద్రాలను పరీక్ష జరిగే మూడు గంటల పాటు మూసివేసి,144 సెక్షన్ అమలులో పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వారు తెలియజేశారు.




