గాంధారి జూన్ జనంసాక్షి
గాంధారి మండలం రామలక్ష్మణ పల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో నిరుపయోగంగా ఉన్న కానుగు.. మొక్కలు మానవ మనుగడకి ముఖ్య ప్రాణవాయువు అయినా ఆక్సిజన్ అందించే చెట్లు ఈరోజు ప్రాణం లేకుండా పడి ఉన్నాయి పల్లె ప్రకృతి వనలు స్వయంగా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక కీలక ఘట్టం అలాంటిది ఈ గ్రామానికి ఎన్ని రోజులైనా వీళ్ళ దృష్టికి బహుశా రానట్టున్నది ఈ వనంలో అనేక రకాల మొక్కలను నాటడమే ప్రధాన ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది ప్రతి గ్రామాని మొక్కలు నాటి చిన్న పార్కు లాగా పల్లె ప్రకృతి వనం ఉపయోగపడుతుందని ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ పల్లె ప్రకృతి వనాన్ని ప్రారంభించారు కానీ రామలక్ష్మణ పల్లి గ్రామంలో ఉన్న ప్రకృతి వనం అభివృద్ధికి ఇంకా నోచుకోలేదు ఏడేసిన గొంగడి ఆడనే అన్న విధంగా ఎక్కడి మొక్కలు అక్కడే వదిలేశారు నాటడం దేవుడెరుగు కనీసం ఉన్న మొక్కలకి నీరు పట్టలేని దుస్థితి మొక్కలు ఎండిపోతున్న అధికారులు నిమ్మకు నీరెక్కి నట్టు ప్రవర్తిస్తున్నారు అని గ్రామ ప్రజలు వాపోతున్నారు ఇదే కాకుండా గ్రామంలో నీటి సమస్య చాలా ఉంది అని స్థానిక గ్రామస్తులు వాపోతున్నారు ఆ గ్రామస్తుల బాధలు వర్ణన తీరం గాంధారి మండలంలోని ప్రతి ఒక్క గ్రామంలో చెత్త ట్రాక్టర్ ప్రతి రెండు రోజులకు ఒకసారి తిరుగుతూ గ్రామ మురికి మోర్లు శుభ్రం చేస్తూ పంచాయతీ సిబ్బంది ఉంటారు కానీ గ్రామంలో మాత్రం సిబ్బంది కి ట్రాక్టర్ పెట్టండి అని గ్రామస్తులు సిబ్బందిని అడగగా డీజిల్ లేదు, లేక మేము పెట్టము, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి, అని నిమ్మకు నీరెత్తినట్టు సమాధానాలు చెప్తుంటారట దానికి సర్పంచ్ గారిని వివరణ కోరగా నాకు వారు వినడం లేదు నేనేం చెయ్యను అని చెబుతున్నారు కావున 8 నెలల క్రిందట జాయింట్ కలెక్టర్ గారు వచ్చి స్మశాన వాటికను పరిశీలించగా దీనిలో ఏది కూడా సరిగా లేదు మూడు నెలల్లో పూర్తిగా కంప్లీట్ చేయాలి అని చెప్పి వెళ్లారు కానీ ఇదివరకు అలాగే ఉంది అకాల వర్షానికి 15 రోజుల క్రిందట గాలివానకు పూర్తిగా ధ్వంసమైన స్మశాన వాటిక ఇప్పటివరకు దానిని పట్టించుకునే నాధుడే లేడు మిషన్ భగీరథ మంచినీళ్లు ఎప్పుడు వస్తాయో తెలీదు ఆ వచ్చిన నీళ్లు కూడా గ్రామపంచాయతీ సిబ్బందికి అవసరం ఉన్నప్పుడు మాత్రమే వదులుతారు దీనిపైన జిల్లా అధికారులు మండల అధికారులు స్పందించి వెంటనే గ్రామస్తులకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరారు….
పచ్చ మొక్కలకు ప్రాణం లేని పల్లె ప్రకృతి వనం:




