Tuesday, 3 November 2026

పటేల్ సంధ్య ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎ

 

 

 

 

 

శరత్పటేల్ సంధ్య ను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎ శరత్
జహీరాబాద్ జనవరి 30( జనం సాక్షి )తెలంగాణ సాంస్కృతిక సారథి సంగారెడ్డి జిల్లా కళాకారిని పటేల్ సంధ్య ను  జిల్లాలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇతర అంశాల పట్ల పాట-మాట-ఆట ల ద్వారా నిత్యం ప్రజలను చైతన్యం చేస్తున్న సందర్బంగా ఉత్తమ కళాకారిణి గా గుర్తించి సోమవారం జిల్లా కలెక్టర్ ఎ శరత్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి విజయలక్ష్మి సమక్షంలో  ప్రశంసా పత్రం అందించి ప్రత్యేకంగా అభినందించారు. అభినందించిన వారిలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి , రాజర్షి షా ఉన్నారు. తనను గుర్తించి అభినందించినందుకు కలెక్టర్ పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై మరిన్ని పాటలు పాడి, ప్రజలకు చేరువ చేసేందుకు కృషిచేస్తానని సంధ్య అన్నారు