మంథని, జనం సాక్షి : పెద్దపల్లి జిల్లామంథని మండలంలోని ఏక్లాస్ పూర్ జడ్పీహెచ్ ఎస్ పాఠశాల లో పదో తరగతి విద్యార్థులకు సోమవారం పరీక్ష ప్యాడ్ లను పంపిణీ చేశారు. మంథని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆధ్వర్యంలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి గెలిచిన వారికి బహుమతి అందించడంతోపాటు విద్యార్థులందరికి ప్యాడ్ లు అందించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సయ్యద్ సలీమ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుకోవాలని, ప్రభుత్వం కల్పించిన సౌకర్యాలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సంపత్ రావు, కళాశాల అధ్యాపకులు బొల్లవరం శ్రీధర్ రావు, హనుమాండ్ల నగేష్, ఎల్ ఆర్ కే రెడ్డి పాల్గొన్నారు.




