Tuesday, 3 November 2026

పట్టణంలో ప్రారంభమైన అంతర్ రాష్ట్ర గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ

పట్టణంలో ప్రారంభమైన అంతర్ రాష్ట్ర గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ
జహీరాబాద్ జనవరి 1 (జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో కిజర్ యపై అంతర్ రాష్ట్ర గోల్డ్ కప్ క్రికెట్ టోర్నీ ని అట్టహాసంగా ప్రారంభించారు..ముందుగా నిర్వాహకులు కిజర్ యపై బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు.మొదటిరోజు సీసీఏ హైదరాబాద్ జట్టు ఘన విజయం సాధించింది 20 ఓవర్లు మొదటి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వి ఎస్ సిసి జట్టు 7 వికెట్ల నష్టానికి 204 పరుగులు చేసింది దింతో రెండవ ఇన్నింగ్స్ బరిలోకి దిగిన హైదరాబాద్ సిసి జట్టు 20 ఓవర్లతో205 పరుగుల గెలుపు లక్ష్యమైంది. రెండవ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన వి ఎస్ సిసి జట్టు సభ్యులు కేవలం 168 పరుగులు మాత్రమే సాధించి అల్ అవుట్ అయ్యారు.దింతో మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన సీసీఏ జట్టు హైదరాబాద్ జట్టు బృందం సీఎస్ జట్టు పై 38 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది విజయం సాధించిన జట్టుకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన శపి కి కప్పుఅవార్డు అందజేశారు. గతంలో ఎప్పుడు లేనివిధంగా క్రికెట్ టోర్నీ ని నిర్వాహకులు అన్ని ఏర్పాట్లను చేశారు.నిర్వహకులు కిజర్ యపై, మాక్సుద్, మీనాజ్,అస్మాత్ అలీ, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.