205 వ మహర్ శౌర్య విజయ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన సమతా సైనిక్ దళ్ నాయకులు
జహీరాబాద్ జనవరి 1( జనం సాక్షి)
సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో మహర్ శౌర్య విజయ దివాస్ వేడుకలను జహీరాబాద్ పట్టణంలో ఐ.బి గెస్ట్ హౌస్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చి పాస్ట్ నిర్వహించి బాబాసాహెబ్ అంబేద్కర్ కి సమతా సైనిక్ దళ్ నాయకులు, ఉద్యోగస్తులు, సామాజిక ఉద్యమకారులు, మాల మహానాడు నాయకులు, బామ్ సేఫ్ నాయకులు, డిక్కీ నాయకులు పూలమాలలు వేసి, మహర్ శౌర్య విజయ దివాస్ సందర్భంగా అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర వందనం చేసి ఐబి గెస్ట్ హౌస్ ముందు భీమా కోరేగావ్ యుద్ధంలో మహర్ సైనికులు చూపినటువంటి వీరత్వాన్ని, మహార్ వీరుల ధైర్య సాహసాలను నేటి యువతరం కొనసాగించాలని యువతకు సమతా సైనిక్ దళ్ నాయకులు, ఉద్యోగస్తులు, సామాజిక ఉద్యమకారులు మాట్లాడుతూ యువతరానికి సందేశం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సమతా సైనిక్ దళ్ నాయకులు, సామాజిక ఉద్యమకారులు, ప్రజా సంఘాలు, ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు.
205 వ మహర్ శౌర్య విజయ దివాస్ వేడుకలను ఘనంగా నిర్వహించిన సమతా సైనిక్ దళ్ నాయకులు




