Tuesday, 3 November 2026

పట్టణంలో వైభవంగా రథసప్తమి వేడుక

 

 

 

 

హుజూర్ నగర్ జనవరి 28 (జనం సాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శనివారం రథసప్తమి వేడుక వైభవంగా జరిగింది. పాతకాలంలో విష్ణు, లక్ష్మి, రామానుజ అష్టోత్తరాలు, తిరుపావై సేవా కాలం చేశారు. సూర్య భగవానుని సహస్రనామాలతో గులాబీ పూలతో జరిపారు. గోమయంచే తయారు చేయబడిన పిడకల పోయ్యి మీద ఉడికించిన పాయసాన్ని స్వామివారికి నివేదించారు. ఆదిత్య హృదయం పారాయణాన్ని 11 సార్లు మహిళలు పటించారు. అనంతరం మంగళాశాసనం, శాతుమరై నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి కార్యకర్తలు గర్రె భారతమ్మ, పశ్య పిచ్చమ్మ, ఈశ్వరమ్మ, వెన్న పద్మ, మల్లీశ్వరి, భక్తులు పిల్లుట్ల వెంకయ్య, బిక్షం,యగ్నేష్, అర్చకులు భాస్కరాచార్యులు, స్టానాచార్యులు తదితరులు పాల్గొన్నారు