Thursday, 5 November 2026

పట్టణ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులతో సమావేశం

గాంధారి మార్చి జనంసాక్షి
గాంధారి మండలంలోని గురువారం తహసిల్దార్ కార్యాలయంలో పంచాయితీ కార్యదర్శులకు మరియు ఉపాధి హామీ సిబ్బందికి పలు విషయాల పైన సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా గ్రామీణ అభివృద్ధి అధికారి సాయన్న మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామంలో నర్సరీలలలో మొక్కలు మొలకెత్తి విధంగా చూడాలని ప్రతి నర్సరీలో అన్ని రకాల మొక్కలు ఉండాలని గ్రామ గ్రామాన నర్సరీకి షెడ్డు తప్పనిసరి ఏర్పాటు చేయాలని మరియు ప్రతి గ్రామంలో మొక్కలు కొత్త పద్ధతిలో అవగాహన కల్పించి నాటించాలని ఎప్పటికప్పుడు పంచాయతీ కార్యదర్శులు ట్రాక్టర్ ద్వారా మొక్కలకు నీళ్లు పోసి వాటరింగ్ డబ్బులు చెల్లించే విధంగా టిప్స్ రాసి ఇవ్వాలని అన్నారు తొందరలోనే నర్సరీలకు సంబంధించిన బ్యాగ్ ఫిల్లింగ్ పెండింగ్ పేమెంట్ ఏమన్నా ఉంటే తొందరగా క్లియర్ చేయాలని అన్నారు ప్రతి ఒక్క గ్రామంలో లేబర్ అందరూ పనికొచ్చే విధంగా మొబిలైజేషన్ చెయ్యాలని అన్నారు అన్ని గ్రామాలలో ఉపాధి హామీ పని చేయాలని ఉపాధి హామీలో ముఖ్యంగా గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు అధికార పార్టీలో ఏదైనా పదవి ఉన్న అభ్యర్థిని రాకుండా వారికి చెప్పాలి అని అన్నారు ప్రతి ఒక్క లేబర్ కు ఒక్క రోజుకు 257 రూపాయల చొప్పున డబ్బులు వచ్చే విధంగా పనిచేపించాలని అన్నారు ఇట్టి కార్యక్రమంలో ఎంపీడీవో పంచాయతీ సెక్రెటరీ లు ఉపాధి హామీ సిబ్బంది ఈ సి పాల్గొనడం జరిగింది