హైదరాబాద్, మార్చి20: విభజన అంశాలపై ఇరు రాష్ట్రాలు పట్టువిడుపులు ప్రదర్శించాలని కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి ఏకే సింగ్ సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో ఏకే సింగ్ శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితి బాగాలేదని, శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని కోరారు. లేకుండా కేంద్రం జోక్యం చేసుకోకతప్పదని పేర్కొన్నారు.




