Wednesday, 4 November 2026

పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీవో గౌతం

పడమట నర్సాపురం ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఐటీడీఏ పీవో గౌతం

జూలూరుపాడు, డిసెంబర్ 15, జనంసాక్షి: మండల పరిధిలోని పడమట నర్సాపురం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో గత నాలుగు రోజుల క్రితం ఫుడ్ పాయిజన్ కారణంగా దాదాపు 40 మంది విద్యార్థులు ఆరోగ్యానికి గురయ్యారు వీరందరికీ జూలురుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం అందించారు. ప్రస్తుతం వీరందరికీ ఉపశమనం లభించింది. ఆశ్రమ పాఠశాల పిల్లలకు అనారోగ్యం విషయం తెలుసుకున్న ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ గౌతమ్ గురువారం ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాల విద్యార్థులు అనారోగ్యానికి గురి కావడం పట్ల విచారణ చేశారు. విద్యార్థులకు బోధన, పరిశుభ్రత, ఆహారం తయారీ వంటి పలు విషయాలను నిశితంగా పరిశీలించారు. రోజు వారీ పిల్లలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, రుచులు వంటి విషయాలపై కూడా పిల్లలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఆహారం తయారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉందని, కానీ నిర్లక్ష్యం వల్లనే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట తహసిల్దార్ లూధర్ విల్సన్, ఎండిఓ తాళ్లూరి రవి, ఎంఈఓ వెంకట్ ఉన్నారు.