Wednesday, 4 November 2026

ప్రాణాలను పనంగా పెట్టి స్నేహితుడిని కాపాడిన అశోక్.

ప్రాణాలను పనంగా పెట్టి స్నేహితుడిని కాపాడిన అశోక్..
కామారెడ్డి ప్రతినిధి డిసెంబర్15 (జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం నుంచి రాళ్ళ గుహలో చిక్కుకుపోయాడు. సింగరాయ పల్లి అటవి ప్రాంతంలో వేటకు వెళ్ళిన రాజు తన సెల్ ఫోన్ రాళ్ల మధ్య జారిపోవడం తో దాని కోసం దిగి మధ్యలో చిక్కుకుపోయి విషయం తెలిసిందే.

కామారెడ్డి
జిల్లా రామారెడ్డి మండలం రెడ్డి పేట గ్రామానికి చెందిన చాడ రాజు మంగళవారం మధ్యాహ్నం నుంచి రాళ్ళ గుహలో చిక్కుకుపోయాడు. సింగరాయ పల్లి అటవి ప్రాంతంలో వేటకు వెళ్ళిన రాజు తన సెల్ ఫోన్ రాళ్ల మధ్య జారిపోవడం తో దాని కోసం దిగి మధ్యలో చిక్కుకుపోయి విషయం తెలిసిందే. కాగా రాజును గుహ నుంచి బయటకు తీయడానికి రెస్క్యూ టీమ్‌కు అశోక్ చాలా సహాయం చేశాడు. ఎవరూ చేయలేని సాహసం చేసి కిందనుంచి గుహ లోపలికి వెళ్లి.. రాజు పరిస్థితి తెలుసుకొని పోలీసులకు వివరించారు. అలాగే రాజు గుహలో చిక్కుకున్న పొజిషన్ ను అధికారులకు వివరంగా చెప్పడంతో బండరాళ్లను బ్లాస్టింగ్ చేసేందుకు అనుకూలంగా ఉందని చెప్పడం వల్ల పోలీసులకు ఈ రెస్క్యూ ఆపరేషన్ సులభంగా మారింది