Tuesday, 3 November 2026

పత్రికలు జనం పక్షం నిలవాలి -సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు పిలుపు

 

 

 

 

 

 

 

కంటోన్మెంట్ జనంసాక్షి మే 03 సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం లో డిప్లొమా కోర్సు ఆన్ లైన్ తరగతులకు హాజరైన విద్యార్ధులని ఉద్దేశించి పత్రికలు జనం పక్షం నిలవాలని, జనం కోసం పోరాడాలని,సి.ఆర్.మీడియా అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు పిలుపునిచ్చారు.
అనంతరం సి.ఆర్.మీడియా అకాడమీ ఆధ్వర్యంలోజర్నలిజం లో డిప్లొమా కోర్సు ఆన్ లైన్ తరగతులకు హాజరైన విద్యార్ధులని ఉద్దేసించి “అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినాన్ని” పురస్కరించుకుని బుధవారం ఆయన మాట్లాడారు.1991 వ సంవత్సరం లో ఆఫ్రికన్ జర్నలిస్టులు విడుదల చేసిన ఒక ప్రకటన ఆధారంగా “యునెస్కో” “అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినాన్ని” ప్రకటించిందని ఆయన వివరించారు. ఇదే రోజు ఆయా దేశాల్లో మీడియా స్వేచ్ఛ పై ర్యాంకింగ్ లు ప్రకటించడం జరుగుతుందన్నారు.”మానవ హక్కులు పెంపొందింప చేయడం లో మీడియా పాత్ర” అనేది ఈ సంవత్సర థీమ్ గాయు నెస్కో ప్రకటించిందన్నారు.
కందుకూరు వీరేశలింగం పంతులు కాలం నుంచి మానవ హక్కుల పై,సామాజిక రుగ్మతలను రూపు మాపే కృషిలో పత్రికలు తమ వంతు పాత్రను సమర్ధనీయంగా పోషించాయని ఆయన గుర్తు చేశారు.ఇప్పటికీ మానవ హక్కుల పరిరక్షణలో ప్రాణాలను సైతం పణంగాపెట్టి పాత్రికేయులు యుద్ధం సమయాల్లోనూ పని చేయడం మనం చూస్తున్నామన్నారు.
చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత దేశంలో పత్రికా స్వేచ్ఛ చాలా మెరుగు గా ఉందని ఆయన చెప్పారు. కాకపొతే ఇది రాజకీయాలకతీతంగా వుండడంలేదన్నారు.
రాజకీయాలను బట్టి పత్రికా స్వేచ్ఛను అనుభవించడం సరైనది కాదన్నారు.ఆయా రాజకీయ పక్షాలు తమ మీడియా ను కలిగి ఉండడం అనేది స్వాతంత్రోద్యమ కాలం నుంచీ వున్న విధానమే అని ఆయన అన్నారు.అసత్య ప్రచారాలకు తావులేకుండా వార్తలు ప్రచురించడం మౌలిక సూత్రం అని ఆయన పేర్కొన్నారు. ఇదెక్కడి పత్రికా స్వేచ్ఛ అనుకునేలా వార్తలు వుండడం వాంఛనీయం కాదన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వున్న మీడియా స్వేచ్ఛ ముందెన్నడూ లేదని, ఇష్టాను సారం ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి పైనే వార్తలు ప్రచురించినా ఏమీ అనని పరిస్థితులున్నాయన్నారు. సంకుచితమైన వ్యాపార ప్రయోజనాలకు రాష్ట్ర అభివృద్ధిని ముడిపెట్టి వార్తలు ప్రచురించడం ప్రజల హక్కుల్ని కాల రాయడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ పరిస్థితి లో మార్పు రావాలని ఆయన కోరారు.
కోర్సుకోఆర్డినేటర్ ఎల్.వి.కె. రెడ్డి మాట్లాడుతూ పత్రికలు ప్రతిపక్ష పాత్రనో, అధికార పక్ష పాత్రనో పోషించ కుండాప్రజా పక్షాన వుండాలనిఅన్నారు.అభియోగాల కు సంబంధించి రెండొవ పక్షం వాదన వార్తలో పొందుపర్చకపొతే అది మౌలిక సూత్రాలకు విరుద్ధం అని ఆయన అన్నారు.
వ్యాఖ్యాత,రచయిత నాగసూరి వేణుగోపాల్ మాట్లాడుతూ మొదటి ప్రపంచ యుద్ధం లో సమాజం కోసం వ్రాయడం మొదలయిందని, దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే జర్నలిజం సుమారు వందేళ్ల చరిత్ర కలిగిందని ఆయన పేర్కొన్నారు. దేశ స్వాతంత్రోద్యమ కాలంలో జాతినిఅంతా ఒక్క తాటి మీదకు తేవడంలో మీడియా పని చేసిందన్నారు.అయితే, మీడియా తమకు కావాల్సిన సమాచారం మాత్రమే,తమకు అనువైన రీతిలో ఇవ్వడం సరి కాదన్నారు.ఇలాంటి పరిస్థితులుసరిదిద్దడంలోయూనివర్సిటీలు,మీడియా అకాడమీలు చొరవ చూపాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో సి.ఆర్ ఎ.పి మీడీయా సెక్రటరీ మామిడిపల్లి బాలగంగాధర్ తిలక్, సి.ఆర్.ఎ.పి మీడియా కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు పాల్గొన్నారు.