మల్కాజిగిరి.జనంసాక్షి.మే3 బస్తీలలో నెలకొన్న సమస్యలు పరిష్కరించడంలో అధికారులు,ప్రజా ప్రతినిధులు విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అధ్యక్షులు నంది కంటి శ్రీధర్ అన్నారు.
వినాయక నగర్ డివిజన్ మసీదు గల్లి నుండి హాత్ సే హాత్ జోడో యాత్ర లో భాగంగా ఇంటి ఇంటికి వెళుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తెలియజేస్తూ,కాంగ్రెస్ ప్రభుత్వం అధకారంలోకి వచ్చిన తర్వాత 500 గ్యాస్ సిలిండర్,80 గజాల స్థలము
ఉన్న పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు రుణ సహాయం,అర్హులైన నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, ఆరోగ్యశ్రీ 5 లక్షల వరకు అమలు చేస్తామని ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షులు సంతోష్ ముదిరాజ్,వెంకటేష్ యాదవ్,గుత్తి రామచందర్,శ్రీనివాస్ యాదవ్, నరసింహ గౌడ్, హనుమంతు,కీర్తి గణేష్, దుర్గ సాయి,సాయికుమార్,అమర్నాథ్, బాలకృష్ణ,ఆశ,సాయిరాం,జెకె సాయి, గిరియాదవ్,అశోక్ యాదవ్,సంజీవ్ యాదవ్,సత్తయ్య గౌడ్,జగదీష్ యాదవ్,యాదగిరి,ఓదాల్,శ్రీనివాస్ గౌడ్ ఉమేష్ సింగ్,చాకో,కుట్టి శ్రీను,వినోద్ యాదవ్,సానాది శంకర్,రాములు, విట్టల్,జీవన్ రెడ్డి,రెబ్బ వాసు,గఫూర్,
బికే శ్రీనివాస్,సూర్య ప్రకాష్,వేణు, ప్రవీణ్,అశోక్ రెడ్డి,చంద్రశేఖర్,కృష్ణ గౌడ్, శ్రీనివాస్,సంతోష్ యాదవ్,పవన్, సాయికుమార్,మాధవి,ప్రభా తదితరులు పాల్గొన్నారు.




