బిచ్కుంద ఏప్రిల్ 27 (జనంసాక్షి)కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని బిచ్కుంద మండలంలో గల పత్లాపూర్ గ్రామంలో మంగళవారం నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కష్టాలను తెలంగాణ ఉద్యమ సమయంలో స్వయంగా చూసి చలించిపోయారని, అందుకే నేడు రైతులను అన్ని విధాల ఆదుకుంటున్నారని అన్నారు. రైతు బంధు, రైతు బీమా, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం వంటి అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం కల్పిస్తోందని రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో యాదవ్, సర్పంచ్ అరుణ్ కుమార్, వెంకట్రావు దేశాయ్, వ్యవసాయ శాఖ అధికారులు మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.




