ఝరాసంగం): ఐకేపీ వివోఏ లను సెర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చేపట్టిన సమ్మె 11 వ రోజుకు చేరుకుంది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఐకేపీ వివోఏ ల నిరవధిక సమ్మె కు సిఐటీయూ కార్యదర్శి చంద్రన్న బహుజన సంఘర్షణ డివిజన్ ఇంచార్జి రాయికోటి నర్సింలు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లో ఐకేపీ వివోఏ లు వెట్టి చాకిరీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివోఏ ల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.వారికి సెర్ఫ్ ఉద్యోగులు గా గుర్తించాలి,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలి,పది లక్షల రూపాయల సాధారణ, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, సెర్ఫ్ గుర్తింపు కార్డులు జారీ చేయాలని, ప్రతి నెలా వేతనాలు వ్యక్తి గత ఎకౌంటు లో వేయాలని, ఆన్లైన్ పనులు చేయించ వద్దని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఝరాసంగం మండల అధ్యక్షురాలు పద్మారాణి, కార్యదర్శి నింగమ్మా ప్రధాన కార్యదర్శి ఖాజామియా, కోశాధికారి వసంత ,సిద్దన్న, మహ్మద్,సూర్ రెడ్డి, సిరాజ్, రాజు పటేల్,సుర్ రెడ్డి,మహమ్మద్,సోపియోద్దీన్,నర్సింలు,,సంధ్యారాణి,మాధవి అనిత పద్మ ,మరియమ్మ, నాగమణి,, పుష్పలత తదితరులు పాల్గొన్నారు.




