Tuesday, 3 November 2026

పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు

 

 

 

 

కొత్తగూడ ఏప్రిల్ 27 జనంసాక్షి:మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా పంట నష్టాలను అంచనా వేస్తున్న వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాలలో క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు.మండలంలో ఎంచగూడెం,ఓటాయి,సాధిరెడ్డిపల్లి గ్రామంలో నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించి వారి వివరాలు అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు.నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందేలా ఉన్నతాధికారులకు నివేదిక అందించడం జరుగుతుందని ఏఈఓ అరవింద్ తెలపడం జరిగింది.రైతులు కట్ల యకయ్య జిట్టబోయిన మహేష్ వాసం లచ్చయ్య సంగి అశోక్ యకయ్య ముడిక సతీష్ తదితరులు పాల్గొన్నారు.