పదవతరగతి ఫలితాలలో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
మండల విద్యాధికారి ఈ. రాజు
ఇటిక్యాల (జనంసాక్షి) డిసెంబర్ 15 పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని మండల విద్యాధికారి రాజు అన్నారు. జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశాల మేరకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కొండేరు గ్రామంలోని కాంప్లెక్స్ పాఠశాలలో గురువారం ప్రజ్వల ప్రేరణ తరగతుల కార్యక్రమం ప్రాధానోపాధ్యాయులు అమీర్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థిని, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి చక్కటి ఫలితాలు సాధించాలన్నారు. అనంతరం ప్రోత్సాహ పరిచే వక్తగా కె. రవీంద్ర, ధీర, మేడికొండ ఈశ్వర్ లు విద్యార్థులకు సూచనలు సలహాలిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయభాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, తవిటినాయుడు, విజయ్ కుమార్, సురేష్ కుమార్, శంకరప్ప, తదితరులు పాల్గొన్నారు.




