Thursday, 5 November 2026

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు

కొడకండ్ల,డిసెంబర్ 15 (జనం సాక్షి ) కొడకండ్ల మండలంలోని రామన్నగూడెం గ్రామము BRS పార్టీ నాయకులు, వార్డు మెంబర్ కునుసొత్తు పంతులుకు ఇటీవల హార్ట్ బైపాస్ సర్జరీ కాగా గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.అనంతరం ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.బాధితులను అన్ని విధాల అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
అనంతరం లక్ష్మక్క పల్లి గ్రామంలో పుస్కరి సత్యనారాయణ, వర్రే కొండయ్యలు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి ఇళ్లకు వెళ్లి, వారి చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు.
వారి మృతి పట్ల సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేసి, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతున్ని వేడుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.