Monday, 2 November 2026

పదవి విరమణ పొందిన కార్మికులకు సన్మానం.

ఫొటో : కార్మిక దంపతులను సన్మానిస్తున్న అధికారులు.బెల్లంపల్లి, ఫిబ్రవరి 28, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని శాంతిఖని గనిలో శుక్రవారం పదవీవిరమణ పొందిన కార్మికులు కోల్ కట్టర్ ఇందూరి మల్లయ్య, జనరల్ మజ్దూర్ బోనగిరి రాజయ్య దంపతులను గని ఆవరణలోని వేదిక మీద ఘనంగా సన్మానించారు. ఈ ఇద్దరు కార్మికులు సింగరేణి సంస్థలో 40 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకొని సంస్థ కోసం కష్టపడ్డారని, వారి శేష జీవితం సాఫిగా సాగాలని అధికారులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ సంజయ్ కుమార్ సిన్హా, రక్షణ అధికారి పి రాజు, పిట్ ఇంజనీర్ రాంబాబు, వెంటిలేషన్ అధికారి పూర్ణ చందర్, ఇంజనీర్ రాంసాగర్, టీబీజీకేఎస్ పిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, గని ఉద్యోగులు పాల్గొన్నారు.